సండ్రోన్ పల్లిలో అన్నను చంపిన తమ్ముడు

చిన్న వైర్యం పెద్ద ప్రాణాన్ని తీసింది ,

కుటుంబ కలహాలతో అన్నను హతమార్చిన తమ్ముడు.

జనం పవర్ న్యూస్ మందమర్రి :


సోమవారం డిసెంబర్ 1 ,

మంచిర్యాల జిల్లా
మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్రోన్పల్లి గ్రామంలో సోమవారం రోజు రాత్రి సుమారు 8:00 గంటల సమయంలో కుటుంబ కలహాలు ఒక హత్యకు దారితీశాయి. సొంత తమ్ముడు తన అన్నను రోకలి బండతో కొట్టి హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు.
సంఘటన వివరాలు:
మృతుడి
పేరు: మెండ్రపు గోపాల్,
వయస్సు: 35 సంవత్సరాలు,
తండ్రి పేరు: భీమయ్య
కులము: నాయక్పోడ్,
వృత్తి: మేస్త్రీ ,
గ్రామము: సన్రోన్పల్లి,
నిందితుడి పేరు: మెండ్రపు కుమార్,
వయస్సు: 34 సంవత్సరాలు,
తండ్రి పేరు: భీమయ్య
కులము: నాయక్పోడ్
వృత్తి: కూలీ
గ్రామము: సన్రోన్పల్లి ,సంఘటన నేపథ్యం:
సన్రోన్పల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములైన గోపాల్ (అన్న),కుమార్ (తమ్ముడు) మధ్య కుటుంబ కలహాలు చెలరేగాయి. ఈ క్రమంలో, నిందితుడైన కుమార్ ఆగ్రహంతో రోకలి బండ తో అన్న అయిన గోపాల్ను తల మీద గట్టిగా కొట్టి హత్య చేశాడు. సమాచారం అందిన వెంటనే
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన పూర్తి వివరాలకై దర్యాప్తు చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :