కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం — ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
జనం పవర్, గంగాధర నవంబర్ 29:
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు పట్టం కడతారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శనివారం గంగాధర మండలం మధురానగర్ ప్రజా కార్యాలయంలో కురిక్యాల గ్రామ మాజీ ఉపసర్పంచ్ కడారి కనకయ్య, సర్పంచ్ అభ్యర్థి కడారి రేణుకతో పాటు సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎమ్మెల్యే సత్యం పార్టీ కండువాలు కప్పి కొత్తగా చేరిన వారికి ఆహ్వానమిస్తూ — *“చొప్పదండి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులు అవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది”* అని అన్నారు.
గత 10 ఏళ్లలో అభివృద్ధి దారి తప్పిందని, ఇప్పుడు ప్రతి గ్రామంలో కనిపించే మార్పు కాంగ్రెస్ పాలన ఫలితమని పేర్కొన్నారు.
*“ఈసారి 70 నుంచి 80 శాతం స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయం. ప్రజలు అభివృద్ధి నీతి కి ఓటు వేస్తారు”* అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తీర్మల్ రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, మేర్జ కొండయ్య, అర్కుటి లింగయ్య, ఒగ్గరి శ్రీనివాస్, జవ్వాజి మహేందర్, కవిత తదితరులు పాల్గొన్నారు.








