తహసీల్దార్ నామినేషన్ ప్రక్రియ పర్యవేక్షణ

జనం పవర్, గంగాధర – నవంబర్ 29:


గంగాధర మండల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియను గంగాధర తహసీల్దార్ బూరుగుపల్లిలో పర్యవేక్షించారు. గ్రామ పంచాయతీ పరిధిలో వివిధ పదవులకు అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లను అధికారులు పరిశీలిస్తూ పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో ప్రక్రియను కొనసాగించారు. అభ్యర్థులు, ప్రతినిధులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సహకరించాలని తహసీల్దార్ సూచించారు. నామినేషన్ కేంద్రంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగా, అధికారుల సమన్వయంతో కార్యక్రమం ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా పూర్తయ్యింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :