జనం పవర్, నవంబర్ 29, గంగాధర:
గంగాధర మండలం కురిక్యాల, కటనపల్లి గ్రామాల ప్రజలు గ్రామ మాజీ బీఆర్‌ఎస్ ఉప సర్పంచ్‌తో పాటు కాంగ్రెస్‌లోకి చేరారు. ఈ సందర్భంగా మల్లి సర్పంచ్ నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థితో కలిసి వారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా ధరించారు.
ఈ సందర్భంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ— ప్రజలు పనిచేసే శక్తి ఉన్న నాయకులను గుర్తించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. గతంలో అధికారంలో ఉన్న సర్పంచ్‌లు గ్రామ అభివృద్ధి కోసం ఏం చేశారో గుర్తు పెట్టుకుని, ఎవరికీ ఓటు వేస్తే గ్రామానికి మేలు జరుగుతుందో ఆలోచించాలని సూచించారు.
డబ్బులకు, మందుకు ఓటు అమ్ముకోవద్దని, ఓటును సరిగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.
Post Views: 214








