జనం పవర్, గంగాధర నవంబర్ 28:
గంగాధర మండలం కురిక్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి కడారి రేణుక కనకయ్య నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె అనుచరులు, గ్రామస్తులు భారీగా చేరడంతో ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి తరలివెళ్లారు.
కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ పోటీలో ఉన్నట్లు రేణుక తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరారు. *“గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పంథాలో నడిపిస్తా. ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని మనవి”* అని అన్నారు.
తనకు మద్దతు తెలుపుతున్న గ్రామస్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 152









