అవకాశం ఇస్తే సర్పంచ్ అంటే ఏంటో చూపిస్తా — ఎడుమ్యాకల మమత–తిరుపతి

గంగాధర (అచంపల్లి), జనం పవర్:


అచంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ బరిలో ఎడుమ్యాకల మమత/తిరుపతి నేడు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం జనం పవర్‌తో మాట్లాడుతూ — *“అవకాశం ఇస్తే సర్పంచ్ అంటే ఏంటో చూపిస్తా. పరిపాలనలో సమర్థత, మహిళా శక్తి ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలియజేస్తా”* అని చెప్పారు.

తాను మూడు సంవత్సరాలు SHG లీడర్‌గా పనిచేసిన అనుభవాన్ని ప్రస్తావిస్తూ, గ్రామంలోని మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేశానని, ఐకెపి ద్వారా గ్రామ ప్రజలకు అవసరమైన సహాయాలు అందేలా చేశానని గుర్తు చేశారు.

ఈసారి సర్పంచ్‌గా అవకాశం ఇస్తే అచంపల్లిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, గ్రామ ప్రజలు నమ్మకం ఉంచి ఆశీర్వదించాలని కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :