మితి మీరిన వేగం,ఓవర్ లోడ్ టిప్పర్లతో ప్రమాదాలు…?

జనం పవర్,పెద్దపల్లి / రామగిరి,నవంబర్ 28:


•ఓ రోడ్డు కాంట్రాక్టర్ కు చెందిన టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం

•ఓ ద్విచక్ర వాహనదారున్ని ఢీ కొట్టిన టిప్పర్,వ్యక్తికి గాయాలు

ఓ వైపు జాతీయ రహదారి, మరో వైపు జిల్లా అంతర్గత రహదారులకు అవసరమయ్యే  మట్టి, కంకర తరలించేదిశలో మితి మీరిన వేగం, ఓవర్ లోడ్ తో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

పెద్దపల్లి జిల్లా రామగిరి, మంథని, ముత్తారం మండలాల పరిధిలో జరుగుతున్న జాతీయ రహదారి పనులకు సింగరేణి సంస్థ కు చెందిన ఓబి మట్టిని తరలించుటకు ఓ ప్రైవేట్ గుత్తేదారు సంస్థ టెండర్ దక్కించుకొంది. సంబంధిత గుత్తేదారు సంస్థ కు చెందిన టిప్పర్లు మితి మీరిన వేగం, ఓవర్ లోడ్ నడుస్తున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు.

మరో వైపు ఇటు జాతీయ రహదారి పనులతో పాటు జిల్లాలోని అంతర్గత రోడ్లకు కూడా రామగిరి మండలం బేగంపేట లోని గల ఓ రోడ్డు కాంట్రాక్టర్ ( డాంబర్ ప్లాంట్ యజమాని) కి చెందిన టిప్పర్ల ద్వారా సింగరేణి సంస్థ కు చెందిన ఓబి మట్టిని మరియు కంకర తరలిస్తున్నారనే సమాచారం కూడా ఉంది.

సదరు రోడ్డు కాంట్రాక్టర్ ( డాంబర్ ప్లాంట్ యజమాని) కి చెందిన టిప్పర్లు
మితి మీరిన వేగం, ఓవర్ లోడ్, నిర్లక్షం తోనే గురువారం రామగిరి మండలంలో ఓ ద్విచక్ర వాహనదారునికి ప్రమాదం చోటు చేసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి మితి మీరిన వేగం, ఓవర్ లోడ్ తో నడుస్తున్న టిప్పర్లను కంట్రోల్ చేయాలని, ప్రమాదాలు జరుగకుండా తగిన చర్యలు చేపట్టాలని రోడ్డుకు ఆనుకొని ఉన్న సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :