పెగడపల్లి మండలం నందగిరి గ్రామం
సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రామాల్లో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అభ్యర్థులు, అనుచరుల్లో సందడి మొదలైంది. గ్రామాల్లో ఇంటి ఇంటికి సందర్శనలు, అభివృద్ధి హామీలు, ప్రజాభిప్రాయ సేకరణలు సాగుతున్నాయి.
ఈసారి నందగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ మరింత హోరాహోరీగా మారనుంది. బీసీ మహిళ రిజర్వేషన్ కారణంగా కొత్త రాజకీయ సమీకరణాలు కనబడుతున్నాయి. సుమారు 6 నుండి 7 మంది అభ్యర్థులు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
గ్రామంలో 1800 కు పైగా ఓటర్లు ఉండగా, ఎవరు ప్రజలను తమవైపు తిప్పుకుంటారన్నది ఆసక్తికరం. కొందరు ఇప్పటికే ఇంటింటికీ మద్దతు సంపాదించే యత్నాల్లో నిమగ్నమయ్యారు.
గ్రామ ప్రజల్లో వినిపిస్తున్న మాటల ప్రకారం 30 లక్షల వరకు ఖర్చు చేయగలిగితేనే సర్పంచ్ కుర్చీ దక్కుతుంది అన్న భావన ఉంది. డబ్బు ప్రభావం ఎన్నికలపై పడుతుందనే అభిప్రాయాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు యువత మాత్రం డబ్బు కంటే అభివృద్ధి దృష్టి ఉన్న నాయకుడినే ఆశిస్తున్నట్లు కనిపిస్తుంది.
ఒక రోజు ఇచ్చే డబ్బు కోసం కాదు, వచ్చే ఐదేళ్లు గ్రామం కోసం పని చేసే వారిని ఎన్నిక చేయాల్సిన సమయం వచ్చింది అనే చైతన్యం పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈసారి పోటీని ఆసక్తికరంగా మార్చేది ఇంకో అంశం. స్వప్రయోజనాల కోసం కాదు ప్రజలకు ఏం కావాలో అది చేసే మనస్తత్వం కలిగిన అభ్యర్థుల ప్రవేశం.
అధికారమే లక్ష్యం కాకుండా ప్రజల అవసరాలు తెలుసుకుని పనిచేసే వారిని ఈసారి ప్రజలు ఆశీర్వదిస్తారా అన్నది వేచి చూడాలి.
అదేవిధంగా, గ్రామ ప్రజల్లో ఓటు వేయే విధానంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో అభ్యర్థులు చేసిన సేవలు, భవిష్యత్తులో చేయగల అభివృద్ధి పనులను పరిశీలించి మాత్రమే ఓటు హక్కును వినియోగించాలని ఓటర్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బు ఆధారిత రాజకీయాల కన్నా పనిని ప్రాముఖ్యతనిస్తూ నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి ప్రజలు క్రమంగా దగ్గరవుతున్నారు.
ఏదేమైనా పోలింగ్ రోజునే తేలుతుంది. డబ్బు గెలుస్తుందా లేక అభివృద్ధ….









