నారాయణపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ హోరులో టగాఫర్

జనమ్ పవర్, గంగాధర నవంబర్ 28:


 

సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గంగాధర మండలంలోని గ్రామాల్లో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అభ్యర్థులు, అనుచరుల్లో సందడి మొదలైంది. గ్రామాల్లో ఇంటి ఇంటికి సందర్శనలు, అభివృద్ధి హామీలు, ప్రజాభిప్రాయ సేకరణలు సాగుతున్నాయి.

స్థానిక సమస్యల పరిష్కారం, పంచాయతీ నిధుల వినియోగంపై ప్రజలు స్పష్టమైన అంచనాలు పెట్టుకున్నారు. గతంలో ఎవరు ఏం చేశారో… ఈసారి ఏమి చేస్తారో ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏర్పడింది.

ఈసారి నారాయణపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల పోరు హోరాహోరీగా ఉండబోతుందని స్థానిక రాజకీయ వర్గాల అంచనా. సర్పంచ్ పోస్టు *SC (మహిళ)* రిజర్వేషన్‌గా ప్రకటించడంతో కొత్త అభ్యర్థులకు అవకాశం లభించింది.

ఈ మేరకు ఇప్పటివరకు ఎడుగురు (7) అభ్యర్థులు బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. నారాయణపూర్‌లో సుమారు 1400కి పైగా ఓట్లు ఉండగా, ఈ గ్రామానికి చెందిన ఇస్తారుపల్లి (ఆమ్లెట్ విలేజ్) ఓటింగ్‌లో కీలకపాత్ర పోషించనుంది.

🔹 కాంగ్రెస్ తరఫున ఒకరు పోటీ చేయడం ఖరారైనట్లు తెలుస్తుండగా
🔹 ఇస్తారుపల్లి నుంచీ ఒకరు స్వతంత్ర అభ్యర్థి గా రంగంలోకి దిగేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి
🔹 ఇంకో ఇదుగురు (5) కూడా బరిలో దిగనున్నారు.
ఎంతమంది కరారు అవుతారు , ఎవరు బరిలో ఉంటారు అనేది తెలవాల్సి ఉంది.
ఈసారి పోటీలో ప్రధానంగా  కొత్తవాళ్లే ముందుకు రావడం గ్రామంలో కొత్త ఉత్సాహానికి దారి తీస్తోంది. అభ్యర్థుల కంటే వారికి ఉన్న ప్రజా అనుసంధానం, పని చేసే తీరు నిర్ణయాత్మకంగా మారొచ్చు.

గ్రామ యువతలో వినిపిస్తున్న మాటలు —
“ఇక డబ్బు కోసం ఓటు కాదు… నిజంగా పని చేయగల సామర్థ్యం చూసి ఓటు వేయాలి”

అయితే…
ఏ గాలి ఎటు వీస్తుంది?
అభివృద్ధి గుర్రం పరుగులు పెడుతుందా? లేక మందు ఎరులై పారుతాయా?
పోలింగ్ రోజు ఈ సమాధానాలు బయటకు రానున్నాయి.

ఇది ఇలా ఉంటే…
గంగాధర మండలంలోని నారాయణపూర్‌కి మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :