సర్పంచ్‌ ఎన్నికల్లో విధి విధానాలు (terms and conditions)

జనం పవర్ — గంగాధర, నవంబర్ 27:
మండల పరిధిలో రాబోయే సర్పంచ్‌ & వార్డు సభ్యుల ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు గంగాధర మండల ఎన్నికల అధికారి & ఎంపీడీవో రాము తెలిపారు.

గ్రామసభ నిర్ణయాలు, అభివృద్ధి పనుల వివరాలు ప్రజలకు తెలిసేలా చేయాలని సూచించారు. ప్రజలు నిస్సంకోచంగా ఓటు హక్కును వినియోగించి, తమకు సేవ చేసేవారిని ఎన్నుకోవాలని కోరారు.

అధికారులతో కలిసి పోలింగ్‌ కేంద్రాల ఏర్పాట్లు, భద్రతా చర్యలు, పోలింగ్‌ సిబ్బంది శిక్షణ తదితర అంశాలను పరిశీలించినట్లు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :