సర్పంచ్‌ ఎన్నికల నేపథ్యంలో గంగాధరలో పర్యటించిన సీపీ గౌస్ ఆలం

జనం పవర్, గంగాధర నవంబర్ 27:


సమీపంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం గంగాధర మండల కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతు వేదికను, కూరిక్యాల ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు.

మండలంలోని పోలింగ్ కేంద్రాలు, సున్నితప్రాంతాల పరిస్థితులపై స్థానిక పోలీసు అధికారులతో సీపీ సమీక్ష నిర్వహించారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరూ చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నారని అన్నారు. పోలింగ్ రోజున అదనపు బలగాలు మోహరించనున్నట్టు తెలిపారు.

స్థానిక ప్రజలు కూడా సీపీ గౌస్ ఆలంను కలసి మండలంలోని సమస్యలను వివరించారు. వాటిని పరిశీలించి శీఘ్ర చర్యలకు అధికారులు కట్టుబడి ఉన్నారని ఆయన భరోసా ఇచ్చారు.

సందర్శన కార్యక్రమంలో సీఐ, ఎస్‌ఐలు, పోలీసులు,ఎంపిడిఓ, ఏం.ఈ.ఓ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :