🔴 బ్రేకింగ్ న్యూస్ — తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

 

జనం పవర్,  – నవంబర్ 25


➡️ మొదటి విడత పోలింగ్: డిసెంబర్ 11
➡️ రెండో విడత: డిసెంబర్ 14
➡️ మూడో విడత: డిసెంబర్ 17

పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగి, ఓటింగ్ జరిగిన రోజే మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది.


తెలంగాణలో సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎన్నికలను మొత్తం మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 27వ తేదీ నుంచి మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. 30వ తేదీ నుంచి రెండో విడత, డిసెంబర్ 3వ తేదీ నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది.

మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11న, రెండో విడత 14న, మూడో విడత 17న నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన రోజే మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమై అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది.

తెలంగాణలోని 31 జిల్లాల్లో 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్ వ్యవస్థను కూడా ఖరారు చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

రాష్ట్రంలో కోటి 66 లక్షల గ్రామీణ ఓటర్లు ఉన్నారని, ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఎన్నికల అధికారిణి రాణి కుముదిని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు ఎన్నికల సందడితో కదలాడుతున్నాయి.


 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :