🔺 బ్రేకింగ్ న్యూస్ – ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్‌పై తీవ్ర ప్రమాదం
అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణాపాయం లేదు.
కరీంనగర్ / జగిత్యాల:
కొండగట్టు లో పూజా కార్యక్రమానికి బయల్దేరిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్ త్రుటిలో పెద్ద ప్రమాదం నుండి తప్పించుకుంది. పూడూర్ మండువ దగ్గర ఉన్న బ్రిడ్జ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే—
కొండగట్టు పూజలకు వెళ్తున్న ఎమ్మెల్యే కారు బ్రిడ్జ్‌ను దాటిన కొద్ది సేపటికే, వెనుక వస్తున్న కాన్వాయ్ వాహనాల్లో ఒకటి, జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వస్తున్న మరో కారుతో ఢీకొట్టింది. ఢీకొట్టిన ఆ కారు అదుపుతప్పి పల్టీ కొట్టగా, అదే వేగంతో అది వెనుక వస్తున్న మరొక కాన్వాయ్ కారును కూడా ఢీకొట్టింది. మొత్తం నాలుగు కార్లు ఈ ప్రమాదంలో దెబ్బతిన్నాయి.
అదృష్టవశాత్తూ—
అన్ని కార్లలో ఎయిర్‌బ్యాగ్‌లు సమయానికి ఓపెన్ కావడం వల్ల ఎవరికి ప్రాణాపాయం సంభవించలేదు. కార్లలో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెద్ద ప్రమాదం తప్పించుకోవడం పట్ల స్థానికులు, ప్రజా ప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.











