జనం పవర్, గంగాధర – నవంబర్ 22
గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలో ఉన్న సాదుల్లా బాబా దర్గా వద్ద గురువారం అమావాస్య రాత్రి చోటుచేసుకున్న ఘటన గ్రామాన్ని కుదిపేసింది. వరదకాలువ సమీపంలోని ఈ పవిత్ర దర్గా వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు జరిపినట్టు బయటపడటంతో స్థానికంగా భారీ కలకలం రేగింది.
దర్గా పూజారి ఎం.డి. చాంద్ పాషా తెలిపిన వివరాల ప్రకారం—తెలియని వ్యక్తులు రాత్రి వేళ దర్గా పరిసరాల్లోకి ప్రవేశించి మేకపోతును బలి ఇచ్చి, పసుపు–కుంకుమలు చల్లి క్షుద్ర పూజలను గుర్తించారు. పవిత్రంగా పరిగణించే స్థలంలో ఇటువంటి చర్యలు జరగడం పట్ల గ్రామంలోని ముస్లిం భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ముస్లిం సోదరులు కోరుతున్నారు.
Post Views: 222









