ఫలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషి
గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు మంజూరు
విద్య అభివృద్ధికి పునాది. ఉన్నత విద్య సామాజిక ఎదుగుదలకు మార్గదర్శి. ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకున్న నాయకుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మాటలు చెప్పడం కాదు… చేతల్లో చూపించడం ఎలా ఉంటుందో తన పనితో మరోసారి రుజువు చేశారు.
చిన్న చిన్న కలలతో ముందుకు సాగుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఆలోచించిన ఆయన—గంగాధరతో పాటు చుట్టుపక్కల మండలాల్లోని విద్యార్థుల 20 ఏళ్ల కలను సాకారం చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, చివరకు చొప్పదండి నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల మంజూరు చేయించేలా కృషి చేశారు.
అంతటితో ఆగకుండా, కళాశాలకు సొంత భవనం ఉండాలనే అవసరాన్ని గుర్తించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వ్యవహారాన్ని తీసుకెళ్లి భవన నిర్మాణానికి రూ. 5 కోట్ల నిధులు ఆమోదింపజేశారు. గతంలో అనేక మంది నాయకులు “డిగ్రీ కళాశాల తెస్తాం” అని హామీలు ఇచ్చినా, అవి మాటలుగానే మిగిలిపోయాయి. కానీ మేడిపల్లి సత్యం మాత్రం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే గంగాధర మండల ప్రజల్లో హర్షం వెల్లివిరిసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విద్యా సదుపాయం తమ గ్రామానికే రావడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు… భవనం కోసం రూ. 5 కోట్లు… ఇవన్నీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రాంతాభివృద్ధి, విద్యా పురోగమనంపై చూపుతున్న నిజమైన కట్టుబాటుకు నిలువెత్తు నిదర్శనం.









