##తెలుగింటి ఆడపడుచులకు సర్కారు సారే
##మహిళలే కేంద్రంగా సంక్షేమ పథకాలు అమలు — ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
జనం పవర్, గంగాధర — నవంబర్ 22:
గంగాధరలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ప్రారంభం
సర్కారు ఇచ్చిన నాణ్యమైన చీరలను చూసి మురిసిన మహిళలు
గంగాధర మండలం మధురానగర్‌లోని ఒక ఫంక్షన్ హాల్‌లో శనివారం జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళలకు నాణ్యమైన చీరలను అందజేశారు. ఆడపడుచుల ముఖాల్లో కనిపించిన ఆనందం పెను పండగ వాతావరణాన్ని సృష్టించింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ—
“మహిళలే కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అంకితభావంతో అమలు చేస్తోంది. ప్రతి ఆడపడుచు ఆత్మ గౌరవంగా జీవించడానికి ఈ చీరల పంపిణీ చిన్న సహాయమే అయినా, ఎంతో పెద్ద అర్థాన్ని కలిగి ఉంది” అని పేర్కొన్నారు.
చొప్పదండి నియోజకవర్గంలోని ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీర చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇందిరమ్మ చీరల తయారీకి రాష్ట్రంలోని వేలాది చేనేత కార్మికులకు ఉపాధి లభించడంతో, చేనేత రంగంలో కొత్త ఊపు వచ్చిందని అన్నారు. “కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయడం ప్రభుత్వ లక్ష్యం” అని కూడా పేర్కొన్నారు.
అదే కార్యక్రమంలో, మండలంలోని 31 మందికి కల్యాణ లక్ష్మి కింద రూ. 31,03,596 విలువైన చెక్కులు, అలాగే 34 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. 8,57,500 విలువైన చెక్కులను ఎమ్మెల్యే సత్యం అందజేశారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పురుమల్ల మనోహర్, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రామిడి రాజిరెడ్డి, బూరుగు గంగన్న, రేండ్ల రాజిరెడ్డి, గుజ్జుల బాపురెడ్డి, మంత్రి మహేందర్, గరిగంటి కరుణాకర్, బొంగని సాయన్న, పౌల్, వంగల శ్రీనివాస్, ముద్దం నాగేష్, కనకట్ల తిరుపతి, అట్ల శేఖర్, దోమకొండ మహేష్, దీకొండ మధు, జితేందర్, కడారి కుమారస్వామి, బీర్ల ఆనంద్, పొత్తూరి ప్రభాకర్, మ్యాక్ వినోద్, కోలాపురి లక్ష్మణ్, పెద్దోళ్ల రాజేశం, గడ్డం అంజయ్య, గంగాధర ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.









