వెంకంపల్లిలో వడ్ల కొనుగోలు సెంటర్‌పై దుష్ప్రచారం… నిజాలు వక్రీకరిస్తున్న బి.ఆర్.ఎస్ నేతలు: పాక్స్ (PACS) చైర్మన్ తిరుమలరావు

జనం పవర్ | గంగాధర | నవంబర్ 19:


వడ్ల కొనుగోలు కేంద్రాలపై బి.ఆర్.ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని పాక్స్ సొసైటీ చైర్మన్ వెలిచాల తిరుమలరావు తీవ్రంగా ఖండించారు. చిన్న చిన్న ఇష్యూలను భూతద్దంలో పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

వెంకంపల్లి కేంద్రంలో జరిగిన చిన్న సమస్యలను ఎమ్మెల్యే సత్యం రెండు రోజుల ముందే కలెక్టర్, డిసో, మిల్లర్లతో మాట్లాడి వెంటనే పరిష్కరించారని తెలిపారు. “ఇక్కడ ఎక్కడా రైతులకు ఇబ్బంది లేదు. వచ్చిన చిన్న సాంకేతిక సమస్యల్ని వెంటనే రెక్టిఫై చేసి కొనుగోలు సజావుగా కొనసాగుతోంది,” అని అన్నారు.

కొంతమంది బి.ఆర్.ఎస్ నేతలు 43 కేజీల కథలు సృష్టించడం కూడా తప్పని చెప్పారు. “అసలు ప్రామాణిక బరువు 40.650 కేజీలు. రైతులకు నష్టం జరగకుండా ఎప్పుడైతే తేమ లేదా పరిమాణం సమస్య ఉంటే, రైతులతో మాట్లాడి అదనంగా మేమే చూసుకుంటాం. ఇది మేము చేసే సహకారం—నష్టం కాదు,” అని స్పష్టం చేశారు.

పది సంవత్సరాల బి.ఆర్.ఎస్ పాలనలో 3–5 కేజీల వరకు భారీ కటింగ్లు జరిగాయి. మిల్లర్లు, మధ్యవర్తుల చేతుల్లో రైతులు నానా ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. “అప్పుడు ఒక్కరైనా రైతు పక్షాన నిల్చారా? ఒక్క మిల్లర్ని తాకారా?” అని ప్రశ్నించారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రతి ఇష్యూపై వెంటనే స్పందించి పరిష్కరిస్తోందని తిరుమలరావు చెప్పారు. నారాయణపూర్ భూసేకరణ బాధితులకు 23.5 కోట్లు విడుదల చేయడం, ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరించడం ప్రభుత్వం రైతుపక్షాన పనిచేస్తున్నదానికి నిదర్శనమని అన్నారు.

“దుష్ప్రచారం చేయకుండా, రైతుల నిజమైన పరిస్థితులు ఒకసారి వెనక్కి చూసుకోవాలి,” అంటూ తిరుమలరావు వ్యాఖ్యానించారు.


Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :