జనం పవర్ గంగాధర నవంబర్ 19:
కేంద్రాల్లో కొనుగోలు చేయకుండా బిఆర్ఎస్ నాయకులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ మభ్యపెడుతున్నారని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దుయ్యబట్టారు. గంగాధర మండలం వెంకంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం లో రైతులు ఇబ్బంది పడుతున్నట్లు బిఆర్ఎస్ నాయకులు షో చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎప్ప టికప్పుడు అధికారులను, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను సమన్వయం చేస్తూ సమస్యలు లేకుండా చూస్తున్నారని తెలిపారు. బిఆర్ఎస్ నాయకులు లేని సమస్యను ఉన్నదిగా చూపించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకంపల్లి రైతుల సమస్యను ముందుగానే ఎమ్మెల్యే పరిష్కరించారని తెలిపారు. బిఆర్ఎస్ నాయకులు కావాలనే రాద్దాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. గత బిఆర్ఎస్ పాలనలో క్వింటాలకు 5 నుంచి 6కిలోలు అక్రమంగా తూకం వేసి రైతులను గగ్గోలు పెట్టిన వినోద్ కుమార్, రవిశంకర్ ఏనాడూ కేంద్రాలకు వచ్చిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిలో తాము కనిపించకుండా పోతామన్న భయంతో బిఆర్ఎస్ నాయకులు లేని సమస్యను ఉన్నదని చూపంచి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురికావద్దని, మేడిపల్లి సత్యం రైతులకు అండగా ఉండి ఆదుకుంటున్నారని భరోసా కల్పించారు. మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, మంత్రి మహేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పలుమారి సతీష్, కనకట్ల తిరుపతి, ఆనంద్, వెంకం పల్లె రైతులున్నారు.
Post Views: 114









