జనం పవర్,గంగాధర నవంబర్ 18:
–రైతుల ఆవేదనను పట్టించుకోరా? : మాజీ ఎంపీ వినోద్ కుమార్
— గంగాధర మండల కేంద్ర సొసైటీని సందర్శించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్
గంగాధర మండలంలోని వరి కొనుగోలు కేంద్రాల్లో జోకే సమయంలోకిలోల చొప్పున తగ్గించడం, వెయిట్ లాస్ పేరుతో అతిగా కోతలు విధించడం, లారీలు ఎక్కించిన కొన్ని రోజులకు ‘బస్తాలు కట్ అయ్యాయి’ అంటూ రైతులకు నష్టం కలిగిస్తున్నారని ఫిర్యాదులు రావడం తో రైతుల ఆవేదనపై స్పందించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ మంగళవారం గంగాధర కేంద్ర సొసైటీని సందర్శించి రైతుల పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. రైతులు తమ సమస్యలను మాజీ ఎంపీకి వివరించే క్రమంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీపై 748 బస్తాలు ఎక్కించాం ఒక్కో బస్తలో 42 కిలోలకి 300 గ్రాముల ఎక్కువగా కోతపెట్టారు. లోడ్ ఇక్కడ నుండి వెళ్ళిన మూడో రోజు 8 బస్తాలు ‘కట్ అయ్యాయి’ అంటున్నారు. ఇది ఏ న్యాయం? అని ఒక రైతు బాధ పడ్డారు. మరో రైతు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, “ బస్తాకు అదనంగా 2 కిలోలు 300 గ్రాములు వేస్తారు. అయినా ‘వెయిట్ లాస్’ పేరుతో మళ్లీ కోసేస్తున్నారు. బస్తాలు నిజంగానే తగ్గాయా? లేక తగ్గించారా? అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్నదాత గౌరవం తగ్గనీయం అని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న కోతల దందాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి అని పారదర్శకత లేని తూకాలను, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయని తెలిపారు . కలెక్టర్లు, తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే పర్యా వేక్షించాలని డిమాండ్ చేశారు. రైతు ఫిర్యాదు చేసిన 24 గంటల్లో తప్పనిసరి గా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే, సుంకే రవి శంకర్ మాట్లాడుతూ, మధ్యవర్తులు, మిల్లర్లు, కొంతమంది అధికారులు కలిసి రైతును మోసం చేసే పాత వ్యవస్థ మళ్లీ మొలకెత్తింది అని అన్నారు. ఒకప్పుడు వారం రోజుల్లో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలో చేరేవి ఇప్పుడు మాత్రం జోకే సమయంలో, లారీ వెళ్లిన తర్వాత కోతలు పేరుతో దోపిడీ సాగుతోంది. ఈ దందాను ప్రభుత్వం కఠినంగా అరికట్టాలి” అని పేర్కొన్నారు. రైతుల ధాన్యాన్ని లెక్కల పేరుతో దోచుకునే పరిస్థితులు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.









