జాతీయ మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యడు చిట్టిమల్ల సమ్మయ్య.
జనం పవర్. ములుగు 16:
ములుగు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ములుగు నియోజకవర్గం ఇన్చార్జి జనగాం రవీందర్ అధ్యక్షతన, హలో మాల-చలో ఢిల్లీ పోగ్రాం కి ములుగు జిల్లా ఇంచార్జి రాష్ట్ర అధికార ప్రతినిధి నీరటి రాములు, రాష్ట్ర పోలీట్ బ్యూరో సభ్యుడు చిట్టిమల్ల సమ్మయ్య గార్లు ముఖ్య అతిథులుగా హాజరై
జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో నవంబర్ 26న రాజ్యాంగ హక్కుల సాధన కోసం “ఛలో ఢిల్లీ” కి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది.
జాతీయ మాల మానాడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ బ్యూరో సభ్యుడు చిట్టిమల్ల సమ్మయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోదంలోకి వచ్చిన రోజు నవంబర్ 26 రోజే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రాజ్యాంగ హక్కుల సాధన సభ జరపడం జరుగుతుందని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలోని పౌరులకు హక్కులు మరియు దేశ ప్రజలందరికీ, ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకునే అవకాశాన్ని కల్గించిన మహోన్నత నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలలోనే ఎక్కడ లేని విధంగా, మహిళలకు, పురుషులతో సమాణమైన హక్కులను కల్పించిన మహనీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు, ఈ దేశానికి సుస్థిర మహోత్తర రాజ్యాంగాన్ని అందిస్తే రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలైనా పాలకులు రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసే విధంగా దళితులపై దాడులు వారి హక్కులకు భంగo కల్పిస్తూ పాల్పడుతున్నారు.ఉదాహరణకి గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గావాయ్ గారిపై సుప్రీం కోర్ట్ లోనే మతోన్మాద లాయర్ షూ విసరడం ఒక దేశ అత్యున్నత పదవిలో ఉన్న దళితులకే ఈ పరిస్థితి ఉంటే ఇక దేశంలో ఉన్న సామాన్య దళితుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. అదేవిధంగా మాల జాతికి ఏ సమస్య వచ్చినా వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారు భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు చారిత్రాత్మకంగా సుమారు 1200 కిలోమీటర్ల మహా పాదయాత్ర చేసి ముగింపు రోజు 10 లక్షల మందితో మహాసభ జరిపి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేవడం జరిగింది, అదేవిధంగా మొన్నటికి మొన్న మాలల, అనుబంధ కులాల విద్య ఉపాధి అవకాశాలను Go. 99 ద్వారా తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే జీవో నెంబర్ 99 ని సవరించి రోస్టర్ విధానాన్ని సవరించాలని రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం పెద్ద ఎత్తున జరిపి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం జరిగింది.పై విధంగా మాలలకు మరియు దళితులకు ఏ సమస్య వచ్చినా అంబేద్కర్ వారసులుగా ముందుంటూ జాతీయ మాలమహానాడు రాష్ట్రస్థాయిలోనే కాదు ఢిల్లీ వీధుల్లో సైతం నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకొని ఈ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రాజ్యాంగ హక్కుల సాధన సభ ద్వారా పలు డిమాండ్స్ తో నవంబర్ 26వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ లో నిర్వహించుకోవడం జరుగుతుంది, కాబట్టి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మాలలు,మాల అనుబంద కులాల మరియు దళిత నాయకులు, మేధావులు, విద్యార్థి నాయకులు,కార్యకర్తలు ,పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాదరి రాంబాబు, జిల్లా నాయకులు కాళ్ళ రామకృష్ణ,తోగరు అశోక్, రఘు, దండ్రే శంకర్, ఊళ్లేరావు శ్రవణ్ కుమార్ మరియు మంగపేట మండల అధ్యక్షులు మంచాల నాగేంద్ర కుమార్, వెంకటాపూర్ మండల నాయకులు కుక్కల నారాయణ, నారామల్ల సారంగపాని తదితరులు పాల్గొన్నారు.









