జనం పవర్ గంగాధర | నవంబర్ 16
20 ఏళ్ల నిరీక్షణకు తెర – ఫలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషి
నారాయణపూర్ నిర్వాసితులకు రూ.23.50 కోట్ల పరిహారం మంజూరు చేసిన ప్రభుత్వం
నారాయణపూర్, మంగపేట, చెర్లపల్లి (ఎన్) గ్రామాలకు చెందిన ముంపు బాధితుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గంగాధర మండలం మధురనగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు నిర్వాసితులు పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ముంపు – 20 ఏళ్లతో ముగిసిన వేచి చూడటం
గంగాధర మండలం నారాయణపూర్, మంగపేట, చెర్లపల్లి (ఎన్) గ్రామాల భూములు, ఇండ్లు ఎల్లంపల్లి ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యాయి. 20 ఏళ్లుగా పరిహారం కోసం తిరుగుతూనే ఉన్నా, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపూర్ నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని ఇచ్చిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ ఇప్పుడు నెరవేరింది.
ప్రభుత్వాన్ని ఒప్పించిన ఎమ్మెల్యే సత్యం
ఎమ్మెల్యే సత్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి ముంపు బాధితుల స్థితిని తీసుకెళ్లారు. అలాగే ఫిబ్రవరి నెలలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని నారాయణపూర్ గ్రామానికి తీసుకువచ్చి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూపించారు. ఈ ప్రయత్నాల నేపథ్యంలో ప్రభుత్వం నారాయణపూర్ నిర్వాసితులకు రూ.23.50 కోట్లు పరిహారంగా మంజూరు చేసింది.
పాలాభిషేకంతో కృతజ్ఞతల ప్రదర్శన
పరిహారం మంజూరవంతో ఆదివారం మధురానగర్ చౌరస్తాలో నిర్వాసితులు, కాంగ్రెస్ నాయకులు భారీగా చేరి సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మా బాధను అర్థం చేసుకుని పరిహారం మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, కృషి చేసిన ఎమ్మెల్యే సత్యం గారికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు
ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తీర్మల్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, బుచ్చన్న, రామిడి రాజిరెడ్డి, బుర్గు గంగన్న, సాగి అజయ్ రావు, సత్తు కనుకయ్య, కర్ర విద్యాసాగర్, తోట సంధ్య, కవిత, వేముల అంజి, బాపు రెడ్డి, మేర్జ కొండయ్య, స్వామి, దికొండ మధు, నగేష్, కొల ప్రభాకర్, మ్యాక్ వినోద్, మహేష్, గంగివేణి నవిన్ తదితరులు పాల్గొన్నారు.










