జనం పవర్, హనుమకొండ, నవంబర్ 13: వరంగల్ పోలీస్ కమిషనరేట్,సుబేదారి పోలీస్ స్టేషన్ హనుమకొండ రాంనగర్ ప్రాంతంలో దొంగల ముఠా హల్ చల్ సృష్టించింది. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు యత్నించిన ఘటన చోటుచేసుకుంది.
రాంనగర్ నివాసి మూడు ఎడ్ల కుమార్ స్వామి రైల్వే ఉద్యోగి కాగా, ఆయన భార్య రజిత అంగన్వాడీ టీచర్.ఉదయం 9 గంటలకు ఇద్దరూ డ్యూటీకి వెళ్లగా,సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరుకున్న రజిత తాళం పగలగొట్టబడినట్లు గమనించి వెంటనే సుబేదారి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న క్లూస్ టీం తో వెంటనే సుబేదారి ఇన్స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ తమ ఇళ్ల వద్ద, కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని,ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వాలని కోరారు.
దర్యాప్తు కొనసాగుతోంది:
ఘటన స్థలానికి సుబేదారి పోలీసులు, క్లూస్ టీమ్ చేరుకుని ఆధారాలను సేకరిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.










