సోయ కొనుగోలుపై నిరసన వ్యక్తం చేసిన బిచ్కుంద రైతులు సెలెక్ట్ చేసి కొనుగోలు చేయడం లేదని ఆందోళన

జనం పవర్, జుక్కల్ ప్రతినిధి దయానంద్ నవంబర్ 12 :


సోయ కొనుగోలుపై రోజు కో నిబంధన పెట్టి రైతులకు ఇబ్బంది గురిచేస్తున్న ప్రభుత్వం అకాల వర్షం కారణంగా సోయలో డ్యామేజ్ అండ్ మట్టి రేణువులు రావడం వల్ల మార్క్ఫైడ్ సిబ్బంది రోజుకో మాటలు మాట్లాడి రైతులకు ఇబ్బంది గురి చేస్తున్నారు.గత ప్రభుత్వం ఎకరానికి సోయ 10 క్వింటాళ్లు కొనుగోలు చేసేది ఇప్పుడు ఎకరానికి 7 క్వింటాళ్లు 50 కిలోలు మాత్రమే కొనుగోలు చేస్తుంది.బిచ్కుంద రైతు వ్యవసాయ కేంద్రంలో పంటను ఆరబెట్టి తేమ శాతం వచ్చిన తర్వాత సంబంధిత అధికారులు చూసి తూకం వేసిన తర్వాత తూకం వేసిన బస్తాలని కొనుగోలు కేంద్రంలో నిలిపి (రిజెక్ట్ ) చేస్తున్నారు అని బుధవారం రైతులు అందరూ ఆగ్రహించి రోడ్డు మీదికి వచ్చి సోయా కొనుగోలుపై నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో సోయా కొనుగోలు విషయంలో ప్రభుత్వ అధికారుల తీరు పట్ల రోడ్డుపై సోయలను వేసి వేసి నిప్పంటించారు. సంఘటన స్థలానికి బిచ్కుంద ఎస్ఐ మోహన్ రెడ్డి చేరుకొని రైతులతో, వ్యవసాయ అధికారుల తో మాట్లాడారు. గురువారం రోజున మొత్తం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు సమాధానం తెలుపడంతో నిరసన ఆపివేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :