జనంపవర్, గంగాధర | నవంబర్ 10 :
గంగాధర మండలం రంగరావుపల్లిలో సోమవారం విజిలెన్స్ & సివిల్ సప్లైస్ అధికారులు అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని పట్టుకున్నారు. పక్క సమాచారంతో విజిలెన్స్ అధికారులు రంగరావుపల్లి గ్రామానికి చెందిన సందవేని గట్టయ్య ఇంట్లో ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని పెద్ద మొత్తంలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు.
తద్వారా అధికారులు అక్కడ దాడి నిర్వహించి, సుమారు 100 నుండి 130 క్వింటాళ్ల పైన బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఎంత మంది వ్యక్తులు కూడా పాలుపంచుకున్న వివరాలు తెలియాల్సి ఉంది. ఇంటి యజమాని కేవలం ఇంటిని అద్దెకు ఇచ్చినట్టుగా తెలుపుతున్నారు. అసలు సూత్రధారులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా 4 రూములో పూర్తిగా బియ్యం నిల్వలు గుర్తించారు.
ఒక డీసీఎం వ్యాన్ పూర్తిగా నిండిపోగా , మళ్ళీ ఇంకొక టాటా ఏసీ వాహనం లో తరలించారు.
అసలు ఈ బియ్యం రేషన్ బియ్యమా? లేక వేరే బియ్యమా? అనేది అధికారులు తేల్చాల్సి ఉంది.
ఈ దాడుల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ బి. ప్రశాంత్ రావు, డి. వరుణ్ ప్రసాద్, సివిల్ సప్లైస్ & ఎన్ఫోర్స్మెంట్ డి.టి డి. ఉషా రాణి సిబ్బందితో కలిసి పాల్గొన్నారు.










