జనం పవర్. మేడిపల్లి.నవంబర్ 08
వేములవాడ పట్టణానికి చెందిన మీనా అనే విద్యార్థిని మేడిపల్లి సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌కు వస్తున్న సమయంలో మార్గమధ్యంలో తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకుంది. వెంటనే ఆమె మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఏఎస్ఐ శంకరయ్య తక్షణమే స్పందించి, సాంకేతిక ఆధారాలతో ఫోన్‌ను గుర్తించారు. తరువాత ఆ ఫోన్‌ను విద్యార్థినికి స్వయంగా అందజేశారు. పోలీసుల వేగవంతమైన చర్యపై విద్యార్థిని మీనా సంతోషం వ్యక్తం చేస్తూ, మేడిపల్లి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రజల భద్రత, సేవ కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే మేడిపల్లి పోలీసులు మరోసారి తమ కర్తవ్యనిష్ఠను చాటుకున్నారు.
Post Views: 135









