నేటి జర్నలిస్టుల (డి జె ఎఫ్ డబ్ల్యు)సభకు తరలిరండి. జర్నలిస్టులందరికీ ఆహ్వానం. -డీజేఎఫ్ ( డబ్ల్యూ ) వ్యవస్థాపకులు మానసాని కృష్ణారెడ్డి.

జనం పవర్, హనుమకొండ చౌరస్తా, నవంబర్ 8:

నిఖార్సయిన జర్నలిజానికి ప్రతీక
చిన్న,పేద పాత్రికేయుల గొంతుక,
సీనియర్‌ జర్నలిస్టు మానసాని కృష్ణారెడ్డి వ్యవస్థాపకుడిగా ఉన్న డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (వర్కింగ్)(డీజేఎఫ్‌ డబ్ల్యూ) జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ బస్టాండుకు దగ్గరలో గల ఆదర్శ లా కళాశాలలో ఉదయం 10 గంటలకు జర్నలిస్టుల మహా సభను నిర్వహిస్తున్నట్లుగా ఆ సంఘం వ్యవస్థాపకులు సీనియర్ సంపాదకులు మానసాన్ని కృష్ణారెడ్డి  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంఘం అత్యధిక సభ్యత్వం కల జర్నలిస్టుల సంఘం అని అన్నారు. మహాసభను ఓరుగల్లు జిల్లా జర్నలిస్టుల కోసం  ఆదివారం  హన్మకొండ పట్టణం ఆదర్శ లా కాలేజీలో ఘనంగా జరగనున్నది అని తెలిపారు.సమావేశానికి ఓరుగల్లు జర్నలిస్టులంతా స్వచ్ఛందంగా రండి.. తరలి రండి. అని పిలుపునిచ్చారు.ఇది మన సంఘం…మన ఆత్మగౌరవం…జర్నలిస్టుల హక్కుల సాధనలో గొంతెత్తే ఏకైక సంఘం అని అన్నారు. జనం కోసం పనిచేసే జర్నలిస్టులందరూ మహాసభకు తప్పకుండా హాజరై తమ యొక్క అమూల్యమైన సూచనలు, సలహాలను ఇవ్వాలని ఆయన కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :