ఓటీటీలో ‘వార్ 2’ రికార్డు.. ఇండియాలోనే అత్యధిక వీక్షణలు సొంతం

సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన భారతీయ సినిమాల్లో ‘వార్ 2’ ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్రీరాజ్ ఫిల్మ్స్, స్పై యూనివర్స్లో భాగంగా రూపొందిన ఈ ఫ్రాంఛైజీలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్లు నటించారు. కియారా అడ్వాణీ కథానాయిక. ఆగస్టులో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన విషయం తెలిసిందే. అయితే, ఓటీటీలో మాత్రం రికార్డు స్థాయిలో వ్యూస్ను సొంతం చేసుకుంటోంది. ఈ సినిమా నెటిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ అత్యధిక వీక్షణలు సొంతం చేసుకున్న చిత్రాల జాబితాలో ‘వార్ 2’ టాప్లో ఉన్నట్లు తెలిపింది. అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 12 వరకూ వచ్చిన వీక్షణల ఆధారంగా వెల్లడించినట్లు చెప్పింది. ‘వార్ 2’కు అత్యధికంగా 3.5 మిలియన్ల వీక్షణలు వచ్చినట్లు ప్రకటించింది. దీంతో గతవారం ఇండియాలోనే ఎక్కువమంది చూసిన సినిమాగా వార్ 2’ నిలిచింది. ఇక థియేటర్లో వార్ 2, కూలీ ఒకేసారి విడుదలై పోటీపడ్డాయి. తాజాగా ‘కూలీ’ హిందీ వెర్షన్ కూడా గత వారం ఓటీటీలో విడుదలైంది. అయితే హిందీలో ‘కూలీ’ని ‘వార్ 2’ అధిగమించింది. అక్టోబరు 9వ తేదీ నుంచి ‘వార్ 2’ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు వసూలుచేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :