*మధ్యాహ్న భోజనంలో అపరిశుభ్రత, నిర్లక్ష్యం— బద్దిపడగ హైస్కూల్ హెచ్ఎం పద్మ సస్పెండ్*

 

జనం పవర్, నంగునూరు, అక్టోబర్14:

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో విఫలమవడం మరియు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నంగునూరు మండలం బద్దిపడగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిహెచ్ఎం సిహెచ్. పద్మను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి విధుల నుండి సస్పెండ్ చేశారు.

జిల్లా కలెక్టర్ ఈనెల 13వ తేదీ సోమవారం నాడు నంగునూరు మండలం బద్ధిపడగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం ఆహారం లేకపోవడం, పాఠశాలలో పరిశుభ్రతను సరిగా పాటించకపోవడంను జిల్లా కలెక్టర్ గమనించి పాఠశాల జిహెచ్ఎం సిహెచ్. పద్మను విధుల నుండి సస్పెండ్ చేయవలసిందిగా జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించడంతో సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి నంగునూరు మండలం బద్ధిపడగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిహెచ్ఎం సిహెచ్. పద్మను విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :