జనం పవర్ వేములపల్లి అక్టోబర్ 14
వేములపల్లి మండలంలో గల జడ్పీ హెచ్ఎస్ స్కూల్ నందు పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమంలో సిడిపిఓ చంద్రకళ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి బాల బాలికలకు పోషకాహారము మిల్లెట్స్ చిరుధాన్యాలు, పప్పులు, పాలు, పండ్లు,మునగాకు, గోంగూర ,బచ్చలకూర, తోటకూర, క్యారెట్లు బీట్రూట్లు, పల్లీలు, బెల్లం, నువ్వులు, ఖర్జూర, గుడ్లు, మాంసాహారం ,చేపలు తీసుకోవాలని పోషకాల స్టాల్ ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. మరియు పరిసరాల పరిశుభ్రత ,వ్యక్తిగత పరిశుభ్రత, విద్య వల్ల కలిగే లాభాలు, బాల్య వివాహాలు వల్ల కలిగే నష్టాలు, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు, చక్కెర, నూనెలు, ఉప్పు ఎక్కువ తీసుకోకూడదని పిల్లలకు తెలియజేసినారుతదుపరి సామూహిక శ్రీమంతాలు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతిజ్ఞ చేయించడం జరిగింది .ఈ కార్యక్రమంలో సిడిపిఓ చంద్రకళ , జడ్పీ ఎస్ హెచ్ హై స్కూల్ హెచ్ఎం రమేష్ ,హెల్త్ సి హెచ్ ఓ ప్రవీణ్ ,ఐసిడిఎస్ సూపర్వైజర్స్ పరిమి రజని, జే నాగమణి, హెల్త్ సూపర్వైజర్ శాంతా, ఏఎన్ఎం శైలజ, కవిత మండలంలోని అంగన్వాడీ టీచర్స్ , ఆశ వర్కర్ విఘ్నేశ్వరి ,బాలురు, బాలికలు పాల్గొన్నారు.









