*ఇచ్చిన హామీలు మరిచి ఆటో అన్నలను సంక్షోభం లో నెట్టిన కాంగ్రెస్ సర్కార్*

 

సిద్దిపేట లో ఆటో అన్నలకు కాంగ్రెస్ బాకీ కార్డు స్టిక్కర్స్ ఆటో లకు వేసుకొని ప్రదర్శన..
– సిద్దిపేట లో ర్యాలీ నిర్వహించిన ఆటో కార్మికులు*

*మద్దతుగా గా నిలిచిన సిద్దిపేట ఆటో కో ఆపరేట్ సోసైటీ అధ్యక్షులు పాల సాయిరాం*

జనం పవర్, సిద్దిపేట, అక్టోబర్ :14

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆటో కార్మికుల బతుకులు దుర్భరమైపోయాయని సిద్దిపేట ఆటో క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు పాల సాయిరాం అన్నారు. ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయం ఆలోచించకుండా మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో జరిగిన ఆటో కార్మికుల ఆత్మహత్యలన్నీ ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో అన్నలకు బాకీ కార్డు గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం పట్టణ పురవీధుల గుండా ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ గౌరవ అధ్యక్షుడు పాల సాయిరాం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇస్తామన్న 12వేల రూపాయలు ఇప్పటివరకు చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి ఆటో కార్మికునికి కాంగ్రెస్ ప్రభుత్వం 24 వేల రూపాయలు బాకీ పడిందని తెలిపారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువైన చంద్రబాబు నాయుడు 15 వేల రూపాయల చొప్పున ఆటో కార్మికులకు ఇస్తున్నారని…. చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి తెలంగాణలో ఆటో కార్మికులకు జీవనభృతి ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. ఇప్పటికైనా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుచేసి కార్మికులకు ఇస్తామన్న జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆటో కార్మికులంతా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ సందర్బంగా ఆటో లకు కాంగ్రెస్ బాకీ కార్డు స్టిక్కర్స్ వేసుకొని పట్టణం లో ర్యాలీ నిర్వహించారు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలందరికి వివరిస్తామని ఆటో కార్మికులు తెలిపారు..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :