జనంపవర్, పటాన్చెరు,(జిన్నారం), అక్టోబర్ 14:
సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు బీజేపీ నాయకుడు పి. సుధాకర్ అండగా నిలిచారు. మున్సిపల్ సిబ్బంది గత నాలుగు నుండి ఐదు నెలలుగా జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వారికి సహాయంగా ఒక నెలకు సరిపడా బియ్యం, సబ్బులు, ఇతర అవసరమైన వస్తువులు అందజేశారు.
ఈ కార్యక్రమం జిన్నారం గ్రామంలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పి. సుధాకర్ మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బంది గ్రామ పరిశుభ్రత కోసం కష్టపడుతున్నారు. వారి సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రవీణ్, ఏర్పుల విరేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 49









