సొసైటీ ఫర్ స్పీడ్ జస్టిస్ ఆధ్వర్యంలో బెజ్జంకి శ్రీకాంత్ కి ఘన సన్మానం

 

జనం పవర్, కరీంనగర్, అక్టోబర్ 14:

న్యాయ శాస్త్రంలో అద్భుత ప్రతిభ కనబరిచి, లా ఆఫ్ కాంట్రాక్ట్స్ లో వందకి తొంబై ఒక మార్కులు సాధించి జాతీయ స్థాయిలో రికార్డ్ సాధించిన ప్రముఖ న్యాయవాది బెజ్జంకి శ్రీకాంత్ ను సొసైటీస్ ఫర్ స్పీడ్ జస్టిస్ అధ్యక్షులు కుసుంబ కృష్ణారావు, ప్రధాన కార్యదర్శులు తుమ్మనపల్లి లక్ష్మణరావు ల ఆధ్వర్యంలో ప్రముఖ న్యాయవాది బెజ్జంకి శ్రీకాంత్ కి ఘనoగా సన్మానించారు. ఈ సంధర్భంగా సంస్థ అధ్యక్షులు కుటుంబ కృష్ణ రావు మాట్లాడుతూ బెజ్జంకి శ్రీకాంత్ కి అద్భుత ప్రతిభ ఉందనే విషయo తాను 9 సంవత్సరాల క్రితం గ్రహించానని,అనిత కాలంలోనే అద్భుత ప్రతిభ కనబరిచి న్యాయవాదిగా మంచి పేరు తెచ్చుకున్నాడని కొనియాడారు.సన్మాన గ్రహీత బెజ్జంకి శ్రీకాంత్ మాట్లాడుతూ సొసైటీ ఫర్ స్పీడ్ జస్టిస్ అనే సంస్థ ద్వారా అధ్యక్షులు కృష్ణారావు,ప్రధాన కార్యదర్శులు తుమ్మనపల్లి లక్ష్మణరావు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ, న్యాయవాద వృత్తుల్లో కూడా చాలామందికి స్ఫూర్తిగా ఉంటూ అనుక్షణం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారని,9 సంవత్సరాల క్రితం తాను సాధించిన ఘనతని గుర్తించి ఈరోజు నన్ను ఇంత మంది గొప్ప వ్యక్తుల ద్వారా సన్మానించడం నా పూర్వజన్మ సుకృతమన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :