జనం పవర్,పెద్దపల్లి ప్రతినిది అక్టోబర్ 14:
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మంథని–రామగుండం మార్గంలోని కూడలి వద్ద పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలను ఆపి డ్రైవర్లను ఆల్కహాల్ మీటర్‌తో పరీక్షించారు. మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేసి, తగిన చర్యలు చేపట్టారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి తనిఖీలు తరచుగా కొనసాగుతాయని సీఐ అనిల్ కుమార్ తెలిపారు. వాహనదారులు మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Post Views: 36









