కార్యకర్తల అభిప్రాయమే డిసిసి అధ్యక్షుడి ఎంపికకు ఆధారం : ఏఐసీసీ అబ్జర్వర్ మన్నె శ్రీనివాస్

జనం పవర్, గంగాధర – అక్టోబర్ 14:

గంగాధర మండలంలోని మధురానగర్‌లో మంగళవారం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఏఐసీసీ అబ్జర్వర్ మన్నె శ్రీనివాస్ మాట్లాడుతూ — జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని నియామకం పూర్తిగా కార్యకర్తల అభిప్రాయాల ఆధారంగానే జరుగుతుందని తెలిపారు.

మధురానగర్‌లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో చొప్పదండి నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో ఆయన చర్చించారు. కార్యకర్తల నుంచి సేకరించిన అభిప్రాయాలను అధిష్ఠానానికి పంపిస్తామని, పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు తప్పక దక్కుతుందన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త చురుకుగా వ్యవహరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ అబ్జర్వర్ ఆత్రం సుగుణ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నా రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, కూస రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయినపల్లి మండలాల అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, జవ్వాజి హరీష్, పురుమల్ల మనోహర్, వన్నేల రమణారెడ్డి నాయకత్వంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :