జనం పవర్, జమ్మికుంట, అక్టోబర్ 14:
కరీంనగర్ జిల్లా కలెక్టర్,జిల్లా వైద్యాధికారి ఆదేశానుసారం మంగళవారం వావిలాల గ్రామంలోని రైతు వేదికలో, వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వరుణ ఆధ్వర్యంలో అన్ని విభాగాల వారికి సిపిఆర్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసారు. మండల పరిధిలోని ఉద్యోగులు,ఐసిడిఎస్ ఉద్యోగులు,యువకులు, పంచాయతీ కార్యదర్శులు,గ్రామ ప్రజలకు వివిధ విభాగాల సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి సిపిఆర్ పై అవగాహన కల్పించారు.ఈ అవగాహన సదస్సులో డాక్టర్ వరుణ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులలో ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడే సిపిఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని,కార్డియో పల్మనరీ రీసస్టి టేషన్ (సిపిఆర్) పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నట్లయితే అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తుల ప్రాణాలను ఎలా కాపాడగలమో అనే విషయాన్ని గ్రహిస్తే ఆపదలో ఉన్న వ్యక్తిని రక్షించుటకు వీలు కలుగుతుందన్నారు.గుండె కొట్టుకోవడం మందగించినప్పుడు చేసే అత్యవసర ప్రథమ చికిత్స గుండెపోటు లేదా ఇతర అకస్మాత్తుగా సంభవించే సంఘటనల వంటి అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ చేయడం చాలా ముఖ్యమైన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వరుణ, ఎంపీడీవో విజయ్ కుమార్, ఎంపీఓ వెంకటేశ్వర్లు,మోహన్ రెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్,ఏఈఓ అర్చన,హెల్త్ సూపర్వైజర్ సదానందం,నర్సింగ్ ఆఫీసర్ సాయికుమార్,ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ,ఫార్మసిస్ట్ రాజశ్రీధర్ రావు,ఏఎన్ఎం రమ,పంచాయతీ కార్యదర్శులు,అంగన్వాడీ టీచర్స్, యూత్ మెంబర్స్,ఆశ కార్యకర్తలు,వివిధ విభాగాల సిబ్బంది, గ్రామ ప్రజలు,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.









