జనం పవర్, జమ్మికుంట, అక్టోబర్ 14:
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసారని,బీజేపి నాయకులపై టీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ లో మంగళవారం పిర్యాదు చేశారు.అనంతరం సొసైటీ చైర్మన్ పొనగంటి సంపత్,మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావులు మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న కౌశిక్ రెడ్డిపై అవాకులు, చెవాకులు పేలితే సహించేది లేదన్నారు.ప్రజల్లో ఎమ్మెల్యేకు ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు.మరో మారు తమ నాయకుడిపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే సహించేది లేదని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిలుముల రామస్వామి,ఎండి జానీ, మొలుగూరి వసంత్,మంద రాజేష్,జే కే పొనగంటి శ్రీధర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 37









