గురుకుల పాఠశాలల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తులు ప్రారంభం

 

జనం పవర్,పెద్దపల్లి ప్రతినిది,  అక్టోబర్ 14:
పెద్దపల్లి జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు మిగిలిన ఖాళీ సీట్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని టీజీఎస్‌డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఈ ఎస్ జిల్లా కోఆర్డినేటర్ దేవసేన తెలిపారు.

ఆమె మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, జిల్లా పరిధిలోని కొన్ని పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు.

విద్యార్థులు 2025 అక్టోబర్ 17 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించవలసిందిగా సూచించారు. దరఖాస్తు పూర్తిచేసిన తర్వాత, అవి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, మల్లాపూర్ వద్ద సమర్పించాలి.

దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రవేశ పరీక్ష హాల్ టికెట్ మరియు ర్యాంక్ ధ్రువీకరణ పత్రం జతచేయాలని, పరీక్షకు దరఖాస్తు చేసుకొని హాజరు కాని వారు హాల్ టికెట్‌ను తప్పనిసరిగా జతపరచాలని తెలిపారు. అదేవిధంగా కుల ధ్రువీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికేట్) జిరాక్స్ కూడా సమర్పించాలి.

ఆసక్తి గల అభ్యర్థులు సమయానికి దరఖాస్తులు సమర్పించి, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ దేవసేన సూచించారు.

•బాలికల పాఠశాలలు:

•మల్లాపూర్
•నంది మేడారం
•గర్రెపల్లి
•రామగుండం

•బాలుర పాఠశాలలు:
•మంథని
•పెద్దపల్లి @ సుల్తానాబాద్

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :