జనం పవర్,రామగుండం అక్టోబర్ 14:
రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 25 మంది వ్యక్తులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డారు.
వారిని గోదావరిఖని సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ వెంకటేష్ దుర్వ ఎదుట హాజరుపరచగా, అందులో 24 మందికి మొత్తం ₹48,000 జరిమానా విధించారు.
ఇక ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి రెండవసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడడంతో, ఆయనకు మూడు రోజుల జైలు శిక్ష విధించారు. అనంతరం ఆయన్ని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.
ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరిస్తూ, ఇలాంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
Post Views: 41









