ఆర్. టి. ఐ ప్రతి పౌరుడి హక్కు – గంగాధర ఎస్సై వంశీ కృష్ణ

 

*జనం పవర్, గంగాధర – అక్టోబర్ 14:*

గంగాధర ఎస్సై వంశీ కృష్ణ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మధురానగర్ అంబేద్కర్ చౌరస్తాలో సమాచార హక్కు చట్టం (ఆర్. టి. ఐ) పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్సై వంశీ కృష్ణ మాట్లాడుతూ — “ప్రజాస్వామ్యంలో పారదర్శకతను నెలకొల్పడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు, శాఖల పనితీరుపై ప్రతి పౌరుడికి సమాచారం అడిగే హక్కు ఉంది. ఈ హక్కును సరైన రీతిలో వినియోగించడం ద్వారా అవినీతిని అరికట్టవచ్చు, ప్రజా ప్రయోజనాలను కాపాడవచ్చు” అని అన్నారు.

అదేవిధంగా ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు, ఆలస్యం, అక్రమాలు గమనించినప్పుడు ప్రజలు భయపడకుండా ఆర్. టి. ఐ ద్వారా వివరాలు అడగాలని పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడూ చట్టం గురించి అవగాహన పెంపొందించుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, వ్యాపారులు, యువత పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :