రాష్ట్ర ప్రభుత్వం. వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు హిoగే భాస్కర్

 

జనం పవర్, ఎల్కతుర్తి,, అక్టోబర్ 14

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు హిoగే భాస్కర్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సంకీర్తన ప్రహల్లాద రావు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి గురి చేస్తుందని చేతికందిన వరి పంటలను ఎక్కడ విక్రయించాలో తెలియక సతమతమౌతూ చేతికి వచ్చిన పంటకు దిక్కులేదని అన్నారు 15 రోజులు అవుతున్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం విడ్డూరమని అన్నారు. యాసింగు పంటకు సన్నాలకు బోనసు ఇప్పటివరకు అందలేదని రైతాంగంపై ఇటు వర్ణుడు కన్నెర్ర చేస్తూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి చేస్తున్నారని వెంటనే రైతాంగాన్ని ఆదుకొని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మీడియాతో వారు వివరించారు ఈ కార్యక్రమములో వివి గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :