కలెక్టర్లతో, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

*ఎన్.హెచ్. హైవే నిర్మాణానికి,భూ సేకరణ త్వరగా పూర్తి  చేయాలి*

*జనం పవర్, జగిత్యాల, సెప్టెంబర్ 22*

జాతీయ రహదారుల నిర్మాణానికి,గడువు లోగా భూ సేకరణ,పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆదేశించారు.సోమవారం దూర దృష్ట్య మాద్యమం లో నిర్వహించిన సమావేశంలో హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర సిఎస్ కె.రామ కృష్ణ రావు,లతో కలిసి జాతీయ రహదారుల నిర్మాణం పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, సమీక్ష నిర్వహించారు,జగిత్యాల సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి,జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారని,
హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ విజయవాడ ఎన్.హెచ్ 65 6 లైన్ల విస్తరణ, హైదరాబాద్ నుంచి అమరావతి, మచిలీపట్నం,గ్రీన్ ఫీల్డ్ హైవే, హైదరాబాద్ డిండి, ఎన్ హెచ్ 764 నాలుగు లైన్ల విస్తరణ, ఎన్.హెచ్ 163 మన్నెగూడ సెక్షన్ 4 లైన్ల విస్తరణ, హైదరాబాద్ మంచిర్యాల కారిడార్ 4 లైన్లో గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడర్,పనుల అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పురోగతిపై సంబంధిత జిల్లా కలెక్టర్ లు, ఇతర ఉన్నతాధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,చర్చించి పలు సూచనలు చేశారు,ఈ సమావేశంలో,  ఎన్.హెచ్ అధికారులు , రాష్ట్ర అధికారులు  కలిసి, సమన్వయంతో పని చేస్తూ జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ,వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం సూచించారు.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జాతీయ రహదారులకు మొదటి ప్రాధాన్యతగా,భూ సేకరణ పూర్తి చేయాలని,
ఎన్.హెచ్ 163జి పరిధిలో పెండింగ్ లో ఉన్న 130 హెక్టార్ల భూ బదలాయింపు ప్రక్రియ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని, ఈ రొడ్డు పరిధిలో ఉన్న జిల్లా కలెక్టర్లు  ప్రత్యేకంగా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తూ,భూ బదలాయింపు వేగవంతం చేయాలని, ఆర్డీవో స్థాయి అధికారులకు ప్రత్యేక, బాధ్యతలు, అప్పగించాలని సూచించారు,భూ సేకరణ ప్రక్రియలో కలెక్టర్ లు నేరుగా రైతులతో చర్చించాలని, వారికి జాతీయ రహదారుల అథారిటీ ద్వారా,మెరుగైన పరిహరం అందించేందుకు కృషి చేస్తున్నామని,భరోసా కల్పించాలని అన్నారు,
జాతీయ రహదారుల నిర్మాణంలో కోల్పోతున్న అటవీ శాఖ భూములకు ప్రత్యామ్నాయ భూములు గుర్తించి అడవుల పెంపకం పనులు ప్రారంభించాలని, అటవీ శాఖ ద్వారా అవసరమైన అనుమతులు త్వరగా సాధించేందుకు అధికారులుసమన్వయంతో పని చేయాలని అన్నారు,
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, జగిత్యాల, కోరుట్ల, మెట్టుపెల్లి ఆర్డీవోలు మధుసూదన్, జీవాకర్, శ్రీనివాస్, డి ఎఫ్ వో రవిప్రసాద్,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :