ఆర్గానిక్ పంటలతోనే ఆరోగ్యమైన తెలంగాణ సాధ్యం –డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు.

జనం పవర్, వనపర్తి, సెస్టెంబర్ 22 :

గద్వాల్ పట్టణ కేంద్రంలో బ్రహ్మకుమారీస్ ఆశ్రమంలో మంజుల  ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆర్గానిక్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన  సభకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాల్గొన్నారు.
చిన్నారెడ్డి మాట్లాడుతూ
పూర్వకాలం  మనుషులు జంతువుల పచ్చి మాంసం తింటూ బ్రతికే వాళ్ళు కొంతకాలం తర్వాత మాంసాన్ని కాల్చి తినడం కొంతకాలం తర్వాత వండి తినడం నేర్చుకున్నారు అని అన్నారు.పూర్వం వ్యవసాయం చేస్తే రైతుల ఇంటిదగ్గర ఆవులు, ఎద్దులు, గేదెలు అధికంగా ఉండడంతో  వాటి పేడను వ్యవసాయం పొలంలో చల్లి   ఆర్గానిక్ వ్యవసాయం చేసే వారిని అన్నారు.నేటి కాలంలో రైతుల ఇంటి దగ్గర ఆవులు, ఎద్దులు ,గేదెలు కనిపించ కుండా  తగ్గాయి కాబట్టి జంతువుల పేడ లేకపోవడంతో రసాయనాలు వాడి పంటలు పండిస్తున్నారు అని అన్నారు.ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్  ఆ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మహిళా సంఘాల సహకారంతో ఆవుల  పేడ  ప్రభుత్వమే కొని ఆ రాష్ట్ర రైతులకు సబ్సిడీ కి అందించి  ఆర్గానిక్ వ్యవసాయనికి    సహకరించేది అని అన్నారు.
భారతదేశ జనాభా గణనీయంగా పెరగడంతో జనాభాకు సరిపడు ఆహారాన్ని అందించేందుకు కొత్త రకపు వంగడాలను దిగుమతి చేసుకొని ఆహార ఉత్పతులు పెంచుకున్నామని అన్నారు.
కొత్త రకపు పొంగడాలు అధిక రసాయనిక ఎరువుల వాడకతో అధిక దిగుబడి నిచ్చే రైతుకు లాభం చేకూరేలా ఉండడంతో రైతులు ఎక్కువగా   కొత్త వంగడాలకు అలవాటు పడ్డారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు రైతు పక్షపాతిగా పనిచేసేందని, రైతులకు ఉచిత కరెంటు, రుణమాఫీ, వ్యవసాయ పనిముట్ల పై సబ్సిడీలు ఇచ్చి ఆదుకున్నదని అన్నారు.
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు పక్ష పతి కావున ఆయన వర్ధంతి సందర్భంగా ఉత్తమ రైతుకు అవార్డు పిచ్చి గౌరవించాలని సంకల్పంతో పాలేకర్  రైతు సేంద్రియ వ్యవసాయం ద్వారా  వ్యవసాయం చేస్తూ దేశంలోనే ఉత్తమ అవార్డులు అందుకుంటున్న విషయం తెలుసుకొని పాలేకర్ కు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షలు నగదు, ప్రశంస పత్రం అందజేసి సత్కరించిందని తెలిపారు.
సేంద్రియ వ్యవసాయం చేయడానికి ముఖ్యంగా పాడి పరిశ్రమ ముఖ్యమని అన్నారు.ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి రైతులు మోగ్గు చూపి వ్యవసాయం చేస్తే రోగాలు తగ్గి, ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులను శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ రెడ్డి, అయ్యప్ రెడ్డి, అరుంధతి , వనపర్తి మాజీ జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, గద్వాల్ జిల్లా   వెంకటేష్, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :