హౌస్ అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరు.

జనం పవర్, మంచిర్యాల జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22.

సేవాలాల్  సేన తలపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడిలో ముందస్తు అరెస్టు

ప్రశ్నించే గొంతులను నొక్కుతున్న ప్రభుత్వం.

ఎస్టీ జాబితా నుండి లంబాడి బంజారాలను తొలగించాలని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ  భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, మాజీ ఎంపీ సోయం బాబురావు కాంగ్రెస్ లీడర్లు ఇద్దరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే ఈ విషయం పై మీ నిర్ణయం తెలుపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలకు దేశ ఉన్నత న్యాయస్థానం నోటీసులు పంపించింది. ఐతే ఈ విషయం లో  లంబాడా బంజారా జాతిమీద కుట్రపన్నుతున్న  కాంగ్రెస్  ఎమ్మెల్యే  మాజీ ఎంపీ లను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలనీ తెలంగాణ లంబాడా సమాజం గత కొన్ని రోజులుగా ఉద్యమాలు చేస్తూ నీరసనలు  తెలుపుతున్న ఈ ప్రభుత్వం లో ఎలాంటి స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమం చేపట్టినట్లు  నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా  భూక్య రాజు నాయక్ మాట్లాడుతూ  ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ మా లంబాడ బంజారాల ఓట్లతో గెలిచి మా బంజారా జాతుల పై జరుగుతున్న కుట్రలు, అన్యాయాన్ని పట్టించుకోకపోవడం శోచనీయం అని విచారం వేత్యం చేసారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన విద్యార్థి సంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమం చేపట్టడం  అందులో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సేవాలాల్ సేన   కార్యకర్తలను  పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో  మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం పెరుక పల్లి  గ్రామము లంబాడి తండా కు చెందిన  సేవాలాల్ సేన నాయకులు శ్రీనివాస్ నాయక్, భూక్య రాజు నాయక్, భూక్య శంకర్ నాయక్, గణేష్ నాయక్, తిరుపతి నాయక్,   రమేష్ నాయక్,సురేష్ నాయక్, రవి నాయక్, పరశురాం నాయక్ రాందాస్ నాయక్,ను  పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు భూక్య రాజు నాయక్ తెలిపారు ఈ ప్రభుత్వం ఎన్ని అరెస్టులు చేపించిన మా ఉద్యమం ఆగదని మాకు న్యాయం జరిగే వరకు తెల్లం వెంకట్రావ్,సోయం బాబురావ్ లను కాంగ్రెస్ పార్టీ నుండి  సస్పెండ్ చేసే వరకు  ఇలాగే ఉద్యమం చేస్తామని హేచ్చరించారు.   మాకు అన్యాయం జరిగితే మాత్రం రాబోయే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో లంబాడ, బంజారాల తడాకా ఏందో చూపిస్తామని హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :