గిరిజన  సంఘం, ఉద్యోగుల సంఘం విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో, లంబాడీల ఆత్మగౌరవ బైక్ ర్యాలీ 

జనం పవర్, వనపర్తి, సెస్టెంబర్ 22 : వనపర్తి జిల్లాలో  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  చౌరస్తా నుండి  కలెక్టర్ ఆఫీస్ వరకు  లంబాడీల ఆత్మగౌరవ బైక్ ర్యాలీ   నిర్వహించడం తో వనపర్తి జిల్లాల్లో ఉన్న లంబాడ బిడ్డలను ఎక్కడికక్కడే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేసిన పోలీసులు లంబాడ బిడ్డలను ఎక్కడ ఆగకుండా లంబాడీల ఆత్మగౌరవ  బైక్ ర్యాలీ   గంటసేపు వనపర్తి జిల్లాలో ఒక అలజడిగా రేపడంతో లంబాడీల ఆత్మగౌరవ బైక్ ర్యాలీని కలెక్టరేట్ వరకు వెళ్లడం జరిగింది ప్రజావాణిలో కలెక్టర్ ను కలిసి లంబాడి బిడ్డల యొక్క చరిత్రను తెలియ చేసిన లంబాడి ల జేఏసీ నాయకులు మాట్లాడుతూ బంజారా లంబాడిలు సింధు నాగరికత కాలం నుండే ఈ దేశ ములనివాసులు భారత దేశ స్వాతంత్రానికి ముందే గిరిజనులుగా గుర్తింపు పొందినము, 1871లో బ్రిటిష్ పాలకులు బంజారాలను క్రిమినల్ ట్రైబ్స్ జాబితాలో చేర్చారు, 1931-1941 లో నిజాం రాజులు చేపట్టిన కులగణన లో బంజారా లంబాడిలను గిరిజనుల పట్టికలో చూపించారు 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్టం ఏర్పడినప్పుడు ఆంధ్ర ప్రాంతంలోని లంబాడిలు, సుగాలిలను భారత పార్లమెంట్ ఉభయశభల ఆమోదంతో ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ద షెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్ ఆర్డర్ – 1956 ప్రకారం గిరిజనులుగా గుర్తింపు పొంది గిరిజన జాబితాలో సీరియల్ నెంబర్ 19 గా చేర్చాబడ్డారు. అయితే ఒకే రాష్టంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన గిరిజన లంబాడిలను సుమారు 25 సంవత్సరాలు  గిరిజన జాబితాలో చేర్చకపోవడానికి అప్పటి కాంగ్రెస్ పార్టీ  లంబాడిలను ఘోరమైన అన్యాయం చేసింది అని అన్నారు,1969 కే చందా అధ్యక్షతన వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ఆధారంగా నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ  నెత్రుత్వంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయ సభల ఆమోదంతో ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ద షెడ్యూల్ ట్రైబ్స్ (సవరణ) యాక్ట్ 1976 (యాక్ట్ no 108 of1976) సెప్టెంబర్ 19, 1976 చట్టం చేసి తెలంగాణ ప్రాంతానికి చెందిన లంబాడిలను గిరిజన జాబితాలో క్రమ సంఖ్య 29 గలో చేర్చారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ గత శాసన సభ ఎన్నికల్లో లంబాడిల ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ తాను గద్దెనెక్కనని అనేక సభలలో ప్రకటించారు. కానీ 2017 లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రాంతంలో హింసత్మక ఘటనకు పాల్పడిన సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు లను కాంగ్రెస్ పార్టీ లోకి చేర్చుకున్నారు. తేదీ 24/07/2025 నా వీరిద్దరూ లంబాడిలను గిరిజన జాబితా నుండి తొలగించాలని రిట్ ఫిటిషన్ దాఖాలు చేశారు.ఇది కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారమే జరిగిందా? దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  లంబాడిలకు సమాధానం చెప్పాలన్నారు. దీనిపై బి ఆర్ ఎస్, బీజేపీ ల వైఖరి కూడా ఎటువైపో ? సమాధానం చెప్పాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో  మాజీ ఎంపీపీ శంకర్ నాయక్,
గిరిజన సేవా సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రు నాయక్,  విద్యార్థి సంఘం జేఎసి  శివ నాయక్, మాజీ జెడ్పిటిసి ధర్మానాయక్, మధు, జడ్పిటిసి బస్తీరం నాయక్,కృష్ణ నాయక్, మాజీ ఎంపిటిసి నాగరాజు నాయక్, మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షులు వాలియా నాయక్ తదితరులు లంబాడ సామాజికవర్గం నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :