జనం పవర్, సిద్దిపేట, సెప్టెంబర్ 22:
ఫ్యాక్టరీ రావడానికి కష్టపడింది, చెమట చిందించింది బీఆర్ఎస్ పార్టీ
రేవంత్ రెడ్డి రిబ్బన్ కత్తిరించడానికి కత్తెర జేబులో పెట్టుకొని బయలుదేరిండు.
గాలిలో తేమశాతం లేదని 2018లో పామాయిల్ సాగు జరగదని తేల్చి చెప్పిన కేంద్రం.
*2021లో ఇదే ప్రాంతం గాలిలో తేమశాతం పెరిగి పామాయిల్ సాగుకు అనువైన ప్రాంతం అయింది.*
*ఒకనాడు కరువు ప్రాంతం నేడు పామాయిల్ సాగుబడికి అనుకూలంగా మారింది.*
మళ్లీ కెసిఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. ప్రతి జిల్లాకు పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారు.
*సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ ట్రయిల్ రన్ విజయవంతం అయిన నేపథ్యంలో సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ లు యాదవ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ బి ఆర్ ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.*
*ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.*
నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ ప్లాంట్ కల సాకారం అవడం అనేది గొప్ప విజయం..
అందరి దృష్టిలో ఇది ఫ్యాక్టరీ కావచ్చు కానీ మన దృష్టిలో ఇది ఒక ఎమోషన్..
వేలాదిమంది రైతుల జీవితంలో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకువచ్చే, దశ దిశను మార్చే ఫ్యాక్టరీ ఇది.
2004లో నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ఇదే నంగునూరు నర్మెట్ట నుండి ఒక ఫోన్ వచ్చింది..
నా పక్క పొంటి పొలమోడు బోరేస్తున్నడు. ఆ బోరు వేయకుండా ఆపండి అని ఫోన్ వచ్చింది.
ఎక్కడైతే కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తారో అక్కడ తాహసీల్దార్ అనుమతి తీసుకొని బోర్ వెయ్యాలి.
ఎవరైనా బోర్ ఏస్తే కలెక్టర్కు చెప్పి బోర్ బండిను ఆపించిన రోజులు ఉండేవి.
ఈరోజు తెలంగాణలో, సిద్దిపేటలో, నంగునూరులో బోరు బండ్లు మాయమైపోయాయి.
కెసిఆర్, చేపట్టిన సాగునీటి పనులు, కాళేశ్వరం అయితేనేమి పాలమూరు రంగారెడ్డి, సీతారామ, దిండి ఎత్తిపోతల పథకమైతేనేమి, చెరువులయితేనేమి, చెక్ డ్యాములైతేనేమి ఈ రాష్ట్రం సస్య శ్యామలమై భూగర్భ జలాలు 6 మీటర్లు పెరిగినాయి.
అశ్వరావుపేట, సత్తుపల్లి సముద్రతీరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కాబట్టి గాలిలో తేమశాతం ఉంటుంది. కాబట్టి అక్కడ మాత్రమే పామాయిల్ పండేది.
కేసీఆర్, చేపట్టిన ప్రాజెక్టుల వల్ల పాలమూరు గాని, కాళేశ్వరం గాని, సీతారామ గాని వాటి ఫలితంగా తెలంగాణ ప్రాంతమంతా పామాయిల్ పంట సాగుకు అనుకూలంగా మారింది.
ఖమ్మం జిల్లా పర్యటనకు పోయినప్పుడు ఆశ్చర్యపోయాను. అక్కడ ఉండే రైతులు సంపూర్ణమైన రైతులుగా ఉన్నారు.
సిద్దిపేటకు పామాయిల్ పంట తీసుకొద్దాం అని ప్రయత్నం చేసిన తొలినాళ్లలో.. 2018లో ఇక్కడ ఆయిల్ ఫామ్ సాగు ఉండదు అని చెప్పి వెళ్ళిపోయారు.
గాలిలో తేమశాతం తక్కువ ఉంది ఇక్కడ పామాయిల్ సాగు జరగదు అని తేల్చి చెప్పారు.
ఆ తర్వాత 2019లో అనంతగిరి రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగరుతోపాటు చెరువులు, చెక్ డ్యాముల్లో నీళ్లు నింపుకున్నాం.
2021లో పరిశోధన చేసిన తర్వాత మళ్లీ గాలిలో తేమ శాతం పెరిగింది ఇక్కడ పామాయిల్ సాగు చేసుకోవచ్చు అని ప్రకటించారు.
కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఆయిల్ ఫాం సాగు అవుతున్నది.
రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చిందంటే కారణం కాళేశ్వరం.
బోరు బండ్లు మాయమైనాయి అంటే కారణం కాళేశ్వరం.
వరి వండుతుంది కానీ ఎకరానికి 30,000 కంటే ఎక్కువ మిగలదు..
ఇప్పుడు రేవంత్ రెడ్డి పుణ్యమాని ఎరువులు దొరకక వరి కష్టమైంది.
కానీ ఆయిల్ ఫామ్ సాగు లాభసాటిగా ప్రతినెల జీతం పడ్డట్టు రైతుకు ఆదాయం వస్తుంది.
2022లో జూన్ 5 నాడు నంగునూరు మండల్ రామచంద్రాపూర్ గ్రామంలో మడుగు ఎల్లారెడ్డి అనే రైతు పొలంలో మొదటి పామాయిల్ మొక్క నాటాను..
ఒక్కొక్క రైతును గుర్తించి ఒక్కొక్క ఎకరం పెట్టించి ఈరోజు ఇక్కడ వరకు వచ్చాను.
అందుకే ఏదో భాగోద్వేగం.. అందుకే ఇది మా కల..
చుట్టుపక్కల ఐదు జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీ వరప్రదాయిని కాబోతున్నది.
విత్తనం నాటింది బీఆర్ఎస్… కానీ పండ్లు తినడానికి మాత్రం బయలుదేరింది కాంగ్రెస్ వాళ్లు..
ఈ ఫ్యాక్టరీ రావడానికి వెనుక కష్టం ఎవరిది? తంట ఎవరిది? చెమట చుక్కలు చిందించింది ఎవరు అనేది ప్రజలకు తెలుసు..
2022 ఏప్రిల్ నాడు ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, చేతుల మీద శంకుస్థాపన చేసింది మన ప్రభుత్వం.
పామాయిల్ కు పుట్టినిల్లు మలేషియా. అక్కడ టెక్నాలజీ బాగుందని ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ పెట్టాము.
భారతదేశంలో ఏ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి అయినా వంద టన్నుల గెలలు పంపితే 19 టన్నుల ఆయిల్ మాత్రమే వస్తది..
కానీ ఈ ఫ్యాక్టరీలో 100 టన్నుల గెలలకు 20 టన్నుల పామాయిల్ వస్తుంది.
ఈ లాభాలు రైతుకే వస్తాయి.
గోద్రెజ్, నవభారత్, పతంజలి కంపెనీ వాళ్ళు వచ్చి ఈ టెక్నాలజీని చూసి పోతున్నారు.
ఇయాల రేవంత్ రెడ్డి రిబ్బను కత్తిరించడానికి కత్తేర్లు జేబులో పెట్టుకొని బయలుదేరిండు.
కెసిఆర్, ఆలోచన ప్రతి జిల్లాకు పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టాలని ఉండే.
10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు కోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు.
మల్లి కేసీఆర్ వస్తారు. జిల్లాకు పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారు.
వరిలో, మక్కలో తిప్పి తిప్పి కొడితే 60, 70 వేల కంటే లాభం లేదు. ఇకముందు కోకో పంట వైపు అడుగులు వేద్దాం.
ఫ్యాక్టరీ ప్రారంభమై నిన్ననే ట్రయలు కూడా ప్రారంభించారు..
పామాయిల్ లాభసాటి పంట రైతులు అందరూ పామాయిల్ పంటను వెయ్యండి.









