గంగాధర మధురానగర్‌లో శ్రీ నవదుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

 

గంగాధర మధురానగర్‌లో శ్రీ నవదుర్గా శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ – మధురానగర్🔱🙏🏻🕉️ ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంలో 60 మందికి పైగా యువకులు భవానీమాలలు ధరించగా, 20 మందికి పైగా యువకులు కండువా ధరించి అమ్మవారి సేవలో నిమగ్నమయ్యారు.

మొదటి రోజు ఘనంగా ప్రారంభమైన ఉత్సవాలు మొత్తం 11 రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి. ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు, అలంకరణలు నిర్వహిస్తూ భక్తులు విశేషంగా పాల్గొంటున్నారు.

గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని భక్తి సాంప్రదాయాలకు ఊతమిస్తున్న ఈ ఉత్సవాలు, దుర్గామాత ఆశీస్సులు అందరికీ కలగాలని భక్తులు కోరుకుంటున్నారు.


 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :