జనం పవర్, జమ్మికుంట, సెప్టెంబర్ 22:
కరీంనగర్ జిల్లా డిఎం,హెచ్ఒ,డీటీసీఓ ఆదేశాల మేరకు క్షయ నివారణ విభాగం ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ టీబి అలర్ట్ ఇండియా వారి సహకారంతో వావిలాల, ఇల్లందకుంట,చల్లూరు పీహెచ్ సీ ల వైద్యధికారుల ఆధ్వర్యంలో,సోమవారం జమ్మికుంట వర్తక సంఘం భవనంలో టీబి చాంపియన్స్ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హుజురాబాద్ డివై డిఎం,హెచ్ ఓ డా చందు, ఇల్లందుకుంట పీహెచ్ సీ మెడికల్ ఆపిసర్ డాక్టర్ తులసిదాస్,రోసోర్స్ పర్సన్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ సురేందర్,హెల్త్ ఎడ్యుకేటర్స్ పంజాల ప్రతాప్ గౌడ్,మోహనరెడ్డి హాజరయ్యారు.డా చందు మాట్లాడుతూ క్షయ వ్యాధితో బాధపడేవారు తగు జాగ్రత్తలు వహించడం వల్ల ఇతరులకు వ్యాధి సంక్రమించకుండా ఉంటుందని సూచించారు. ప్రభుత్వం క్షయ వ్యాధికి ఉచిత వైద్యం అందిస్తుందని లక్షణాలు ఉన్నవారు అశ్రద్ధ వహించకుండా వెంటనే నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు.డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ సురేందర్ మాట్లాడుతూ భారత ప్రధాని ఆదేశాల మేరకు 2025నాటికి మన దేశంలో టీబి ని లేకుండా చేయడానికి అందరు టిబి వ్యాధిపైన అవగాహన కలిగి వుండాలని మంచి ఆహారం తీసొకొవాలని వ్యాధి నివారణలో అందరూ భాగస్వాములు కావడం ద్వారా భారత దేశంలో టీబి వ్యాధిని అంతమోందించ వచ్చని సూచించారు.ఈ టీబి ఛాంపియన్ శిక్షణా కార్యక్రమం కొరకు హెల్త్ సబ్ సెంటర్ వారీగా పీహెచ్ సీ సిబ్బంది సహకారంతో క్షయ వ్యాధితో పోరాడి గెలిచిన వారిని ఎంపిక చేసి వారికి క్షయ వ్యాధి నివారణపై శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణ అనంతరం వారిచే గ్రామాలలో టిబి వ్యాధి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, గ్రామంలో క్షయ వ్యాధితో బాధపడుతున్న వారిలో ధైర్యం నింపుతూ వారిని వ్యాధి నుండి విముక్తులను చేయడం జరుగుతుంది అని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు ఇల్లందకుంట పీహెచ్ సీ మెడికల్ ఆపిసర్ డాక్టర్ తులసిదాస్ తెలిపారు. జిల్లా క్షయ నివారణ విభాగం, జనరల్ హెల్త్ సిబ్బంది ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ సమన్వయంతో ఈ టీబి ఛాంపియన్,కమ్యూనిటీ ఎంగేజిమెంట్ కార్యక్రమాల ద్వారా ప్రజలలో టీబి వ్యాధిపైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ కరీంనగర్ జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా మార్చడమే ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం అని ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.









