ప్రభుత్వ పాఠశాలలన్నీ పూర్వ వైభవం గా మారాలి అని కాంగ్రెస్ నాయకులకు ఆదేశం
*ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయుడు పాఠశాల అభివృద్ధి కొరకై లిఖితపూర్వకంగా నివేదన విషయమై ఏకీభవించిన మంత్రి పొన్నం*
జనం పవర్.. సైదాపూర్, సెప్టెంబర్ 22:
సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలోని ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో సరి అయినటువంటి తరగతి గదులు లేని పక్షాన విద్యార్థిని విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, అని పాఠశాల ప్రధానోపాధ్యాయు డైన చిట్టి లక్ష్మారెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి !! తను నివేదించిన వినతి పత్రాన్ని పాఠశాల యొక్క స్థితిగతులను లిఖితపూర్వకంగా తెలియపరిచారు.
సదరు విషయం గురించి మంత్రిపొన్నం పాఠశాల ప్రధానోపాధ్యాయుని ముందే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి త్వరలోనే బొమ్మకల్ పాఠశాలకు తగినన్ని నిధులను సమకూర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించి, పాఠశాల యాజమాన్యానికి హామీ ఇచ్చారు.పై విషయాన్ని పురస్కరించుకొని పాఠశాల పురోగతికి తమ వంతు కృషి చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు అభినందించి, రానున్న పండుగ సందర్భంగా బతుకమ్మ ,దసరా పండుగ శుభాకాంక్షలు మండల ప్రజలందరికీ తెలియజేశారు.









