బిచ్కుందలో రాజ్యమేలుతున్న గ్రామ సింహాలు భయాందోళనకు గురవుతున్న స్థానిక జనం 

జనం పవర్, జుక్కల్ ప్రతినిధి దయానంద్ సెప్టెంబర్ 22 : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఎక్కడ ఏ వీధిలో చూసినా గొర్రెలు, పందుల మందవలె కుక్కల మందలు పెరిగిపోయాయి.వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. కుక్కల సంచారం వల్ల పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఏ   సమయంలో ఎప్పుడు ఎలా కుక్కలు తమను హానికి గురిచేస్తాయో అని ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.వీధుల్లో వెళ్లే ప్రజలపై,వాహనదారులపై కుక్కలు దాడి చేస్తున్నాయి. పాఠశాలలకు వెళ్లే పిల్లలు, వృద్ధులు మరింత ఆందోళన చెందుతున్నారు. వీధి కుక్కల బెడద రోజు రోజుకు తీవ్రమవుతోంది. ప్రజలు భయంతో బహిరంగ ప్రదేశాల్లో సంచరించలేని పరిస్థితి ఏర్పడింది.చిన్న పిల్లలు, వృద్ధులు,మహిళలు రహదారిపై వెళ్లడం కూడా ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే వీధి కుక్కలు ఆకస్మికంగా దాడి చేస్తుండటంతో అనేకమంది గాయపడుతున్నారు.ఇటీవలే రేబిస్‌ సోకిన కుక్కలు పలువురిపై దాడి చేసి,తీవ్ర గాయాలేర్పరిచాయి.ఈ కారణంగా ప్రజల్లో భయం పెరుగుతోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని, వీధి కుక్కలను పట్టి టీకాలు వేయించాలని, రోగగ్రస్తమైన కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి కుక్కలను నియంత్రించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :