*చాకలి ఐలమ్మ విగ్రహాన్ని  ఆవిష్కరించిన ఎమ్మెల్యే* …

జనం పవర్, మెట్టుపల్లి, సెప్టెంబర్ 10:

చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి ఆదర్శమని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. బుధవారం మెట్టుపల్లి మండలం బండలింగాపూర్ గ్రామంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహాన్ని ఎమ్మెల్యే సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ చరిత్రలో అణగారిన వర్గాల ఆత్మగౌరవం, ధైర్యం, పోరాటానికి , ప్రాతికగా నిలిచిన నిలచిన విప్లవనారి సాకలి ఐలమ్మ అని అన్నారు. భూస్వాముల అణచివేతకు ఎదురు నిలిచి, రైతుల హక్కుల కోసం , నిరంతరం పోరాడిన ఆమె పోరాట విప్లవ గాధ ఎప్పటికీ మరువలేనిదని తెలిపారు. సమానత్వం, న్యాయం కోసం, పోరాటం చేసిన పోరాట యోధురాలని, చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మారు సాయి రెడ్డి, బండలింగాపూర్ గ్రామ వీడిసి నాయకులు, గ్రామ ప్రజలు, రజక సంఘాలు, బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :